విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యన్ సి సి 8 ఆంధ్రా నావెల్ యూనిట్ విజయవాడ ఆధ్వర్యం లో యన్ సి సి ATC క్యాంపు కమాండెంట్ కెప్టెన్ వైపీపీ ప్రదీప్ ప్రారంభించారు. ఈ క్యాంపులో సర్వీసు సబ్జెక్ట్, కామన్ సబ్జెక్టు ల తో పాటు డ్రిల్, ఫైర్ ఫైటింగ్, హెల్త్ మరియు హైజీన్, విపత్తుల నిర్వహణ, పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్,ఫైరింగ్, స్విమ్మింగ్ షిప్ మోడలింగ్ వంటి తరగతులు నిర్వహించి క్యాడిట్లు కు శిక్షణ ఇస్తామని కెప్టెన్ వైపీపీ ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా దేశం లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో , జాతీయ విపత్తులు, యుద్ధాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు దేశం కోసం సేవలందించుటకు క్యా డేట్లు కు ఈ క్యాంప్ లో ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది అని ఆయన తెలిపారు. ఈ క్యాంపు ను ఆంధ్రా లయోలా కళాశాలలో నిర్వహించగా 200మంది క్యాడిట్లు పాల్గొన్నారు. లెఫ్టినెంట్ వెంకటేష్ పి బీ సిద్ధార్థ కాలేజీ, సబ్ లెఫ్టినెంట్ స్వప్న స్టెల్లా కళాశాల, థర్డ్ ఆఫీసర్ వెంకటేశ్వర రావు ఏపీ ఎస్ ఆర్ యం స్కూల్ , జెడ్పీ స్కూల్ cadets, చీఫ్ ఇన్స్ట్రక్టర్ సంజయ్ శర్మ మరియు ఇతర యన్ సి సి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News