-జిల్లాకి నిర్దేశించిన 1.10 లక్షల సీసీ ఆర్సీ కార్డులు జారీ చెయ్యాలి
-ఈ క్రాప్, అడంగల్ ను అనుసరించి లక్ష్యాలను సాధించాలి
-ఉపాధి హామీ పని దినాలు లక్ష్యాలను సాధించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి
-వాతావరణ హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలీ
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వంత ఇంటి కల సాకారం చేసే లక్ష్యంతో అదనపు ఆర్ధిక సహాయం విడుదల చెయడం జరిగిందని, ఆయా గృహ నిర్మాణ పనులు పూర్తి చెయ్యడం కోసం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చెయ్యడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి రీ సర్వే, స్వామిత్వ, హౌసింగ్, ధాన్యం సేకరణ, రెవిన్యూ అంశాల పై డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉపాధి హామీ పథకం కింద పామ్ పాంట్ నిర్మాణ పనులను వర్ష కాలం వొచ్చే లోగా పూర్తి చెయ్యాలి ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఇన్సూరెన్స్ పథకం కింద నమోదు చెయ్యడం జరిగిందని, అయితే ప్రమాదాలు సంభవించే సందర్భంలో ఆయా కుటుంబాలకి కల్పిస్తున్న భరోసా విషయాల్లో అవగాహన కల్పించడం, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. కౌలు రైతులకు అండగా నిలిచే క్రమంలో జిల్లాకి ఈ ఖరుడు సీజన్ కు 1,10,000 సీసీ ఆర్సీ కార్డులు లక్ష్యం ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ క్రాప్ బుకింగ్, అడంగల్ ను అనుసరించి కౌలు రైతులకు సీసీ ఆర్సీ కార్డులు జారీ చెయ్యాలి ఉందన్నారు. గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని, అదే విధంగా డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో అదనపు రుణ సదుపాయం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. అదనపు ఆర్ధిక సహాయం పొందిన లబ్దిదారులు ద్వారా గృహ నిర్మాణం కోసం క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించాలన్నారు. ప్రతి శనివారం హౌసింగ్ డే సందర్భంగా లబ్దిదారులతో మమేకం అవ్వాలని కోరారు. గృహ నిర్మాణ పనులు విషయంలో నిర్లిప్తత చూపే వారి జీతాలు నిలుపుదల చేయాలనీ సూచించారు.
నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు రూపొందించిన కార్యాచరణ ఫలితాలు ప్రతిఫలించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సమీక్ష చేసిన తర్వాత కూడా పురోగతి సాధించక పోవడం పై మండల స్థాయి అధికారులు వివరణ కోరారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రజలను జాగృతి చేయాలన్నారు. అటువంటి సమయంలో క్షేత్ర స్థాయిలో సిబ్బందికి నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి సూచనలు చెయ్యాల్సి ఉంటుందన్నారు.ఇటీవల కాలంలో ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయనీ, వాటిని అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, వీడియో కాన్ఫరెన్స్ కు ఎవరు హాజరు అయ్యారో కాలేదో ఆర్డీవో లు ముందుగా నిర్ధారణ చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో సదరు తహసిల్దార్ పనితీరు చూపడం లో అలక్ష్యం వహిస్తే సంబంధిత ఆర్డీవో జవాబుదారీతనం ఖచ్చితంగా వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రీ సర్వే, స్వామిత్వ సర్వే పనుల విషయంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా, గ్రౌండు ట్రూథింగ్ నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణ లక్ష్యాల్ని పూర్తి చేయాలని, అధిక వర్షాలు హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News