-ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్
రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం :
జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం దృష్ట్యా నిర్మాణ పనులకు సంబంధించి ఇసుక ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు, అందులో భాగంగా ఇప్పటి వరకు 1 లక్ష 8 వేల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనీ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలియ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ఇసుక యార్డు లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్ వివరాలు తెలియ చేస్తూ, రానున్న వర్షాకాలం లో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇసుక యార్డులలో ఇసుక అందుబాటులో ఉంచడం కోసం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఆయా స్టాక్ పాయింట్లు లో ఇసుక స్టాక్ పాయింట్లలో టార్గెట్ ఇవ్వడం జరిగిందని, ఆ టార్గెట్ ప్రకారం ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు సందర్భంగా త్వరలో వర్షాకాలం వస్తోందని, గోదావరి నదిలో ఇసుక ఎక్కువ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలో ఒక లక్షా 8 వేల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం అందుబాటులో తీసుకుని రావడం జరిగిందనీ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News