అసిస్టెంట్ జియాలజిస్ట్ శివకిషోర్ ని కలిసిన షేక్. ఖలీఫాతుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశంజిల్లా ఒంగోలులోని జిల్లా భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ శివకిషోర్ ని ఆంధ్రప్రదేశ్ భారతీయ మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్. ఖలీఫాతుల్లా బాషా కలవడం జరిగింది. ఈ సందర్బంగా వారి మధ్యన జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చకు రావడం జరిగింది. అలాగే కార్మికులకు ముఖ్యంగా అవసరమైన కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ -శ్రమ్ కార్డులను వారికి అందజేయడం ద్వారా వారి సంక్షేమానికి తోడ్పాటును అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ అసంఘటిత కార్మికుల కొరకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా ప్రాచుర్యం కల్పించి వారికి అవగాహన కల్పించాలని షేక్. ఖలీఫాతుల్లా బాషా, శివ కిషోర్ లు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా సమర్ధవంతంగా అమలుచేయాలని కూడా వారి మధ్యలో చర్చకు రావడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *