ఫ్రైడే తో మలేరియా డెంగ్యూ దూరం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ డెంగ్యూ దినోత్సవం ఫ్రై డే డ్రై డే పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద   డెంగీ నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి, వ్యాధుల సంక్రమణ పై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ వ్యాధులు పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వ్యాప్తికి కారకాలైన దోమల ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు

మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు ,పాత టైర్లు ఖాళీ డబ్బాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని  కమిషనర్ అన్నారు.  దోమల రకాలు, జీవిత చరిత్ర, వాటి నివారణకు తీసుకునే చర్యలు ,దోమల నివారణకు ఉపయోగించే యంత్ర సామాగ్రి ,డ్రోన్లు కటింగ్ మిషన్లు తదితర సామాగ్రి ప్రదర్శనను పరిశీలించారు. సమావేశంలో ప్రజలతో దోమల నివారణకు తీసుకునే చర్యలు, డ్రైడే ఫ్రైడే కార్యక్రమ ఆవశ్యకత, ధృడ సంకల్పంతో మలేరియా, డెంగ్యూ పారత్రోలతాం అని ప్రతిజ్ఞ, నినాదాలు చేయించారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం దానిలో  ప్రజలందరూ భాగస్వామ్యులు అవ్వడం ద్వారా మలేరియా , డెంగ్యూ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమందరం కంకణ బద్దులై ఉండాలని, అధికారులు, యంత్రాగం సమర్దవంతంగా కార్యక్రమం అమలుచేసి  ప్రజల్లో మార్పు తీసుకురావడం ద్వారా ఈ వ్యాధులు నుండి రక్షణ పోందవచ్చును అని  అన్నారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. యం సుహాసిని,  నగరపాలక సంస్థ బయాలజిస్ట్  సూర్య నాయక్,  అధికారులు, సిబ్బంది,హెల్త్ అసిస్టెంట్లు,ఏ.ఏన్.ఏమ్ లు,ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *