Breaking News

ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర విజయవంతంగా చెయ్యాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు “ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ” లో పాల్గొంటున్న సందర్భంగా, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం రాత్రి, శుక్రవారం ఉదయం ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ను పరిశీలించారు. కార్యక్రమం నిర్వాణ బాధ్యతలను అధికారులకు ఆదేశిస్తూ, నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ప్రజలకు త్రాగునీటి, మజ్జిగ సౌకర్యాలను కల్పించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు స్టేడియంలోపల, ర్యాలీ చేసే దారిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం అయిన వెంటనే పారిశుధ్య నిర్వహణ పక్కగా జరగాలని, జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా పారిశుధ్య నిర్వహణ లో జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *