Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించిన ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి )ను ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పరామర్శించారు. ప్రమాదవశాత్తు లండన్ పర్యటనలో గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో సుజనా చౌదరిని కలిసి పరామర్శించారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి ఈశ్వరరావు, కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు చెన్నుపాటి వజీర్, ఏ సురేష్ , ఎ వి బి సత్యనారాయణ, యలమంచిలి శ్రీధర్, సూరపనేని సురేష్ తదితరులు పరామర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *