ఎమ్మెల్యే సుజనా చౌదరిను పరామర్శించిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో సుజనా చౌదరిని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి త్వరగా కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *