రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం తద్వారా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి నాణ్యమైన ఉత్పత్తులు రైతులు సాధించాలని ఏపీ ఈ డి ఏ, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధారిటీ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి.అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉద్యానవన , ఏపీఎంఐపీ ల ఆధ్వర్యంలో ఎఫ్ బి వో లకు, రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ ఉత్పత్తులను ఎగుమతులు చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్య లు గురించి వాటిని అధిగమించడానికి చేపట్టవలసిన వివిధ ప్రాయోజిత విధి విధానాలపై రైతులకు అవగాహనా కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన లో భాగంగా , అందుకు అనుగుణంగా ఏపీ ఈ డి ఏ నుంచి రైతులకు ప్రతి జిల్లాలోనూ అవగాహనా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదే విధంగా ఎగుమతులు వ్యాపారంలో ఏ విధంగా వ్యవహరించాలి, నాణ్యత ప్రమాణాలు అనుసరించి ఎక్స్పోర్ట్ రంగం పై పూర్తి స్థాయిలో అవగాహనా కల్పిస్తున్నామని అన్నారు.
ఆహార ఉత్పత్తుల అధిక దిగుబడులు సాధించేలా రసాయన (కెమికల్స్) పదార్థాలు అధికంగా వాడకం వల్ల నాణ్యత ప్రమాణాలు పరీక్ష లు చేపట్టే సందర్భంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాటిని అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయ సాగు (ఆర్గానిక్ ప్రొడక్ట్స్) ఉత్పత్తులు ద్వారా మంచి నాణ్యమైన పంటలు అందించ వచ్చని అన్నారు. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ (FPO) ని APEDA లొ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వేరే దేశాలకి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అదే విధంగా ఆర్ధికంగా కూడా తగిన చేయూత నివ్వడం జరుగుతోందనీ తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పలు రకాల పండ్లు, పూలు ఉత్పత్తుల విషయంలో రైతులకు అవగాహనా కల్పించారు. మామిడి లొ ఎన్ని రకాలు ఎగుమతి చెయ్యవొచ్చో అనే విషయాలను వివరించారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి సుజాత కుమారి మాట్లాడుతూ ఉద్యాన రైతులు అందరూ వారు సాగు చేసే ఉద్యాన పంటలను ఎగుమతులు చేసే విధానా లను అవగాహనా చేసుకుని నాణ్యమైన విలువైన పంట ఉత్పత్తులను అందించే విధంగా కృషి చేయాలనీ రైతులందరకి తెలియజేసారు. కెమికల్స్ ద్వారా ఆహార పదార్దాలు నిల్వ సామర్ధ్యం తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అందువల్ల రైతులు అందరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించి మంచి ఆహార పదార్దాలని అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ రైతులందరు కూడా FPO (ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజషన్ ) ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ లు అందుకుంటు క్వాలిటీ ప్రొడక్ట్స్ ని అందించే విధంగా కృషి చేయాలనీ సూచించారు..ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు అందించే FPO లకు మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు.
జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ ఏ .దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యానవన పంటల ద్వా రా వచ్చే ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయన్నారు.వాటిని ఎగుమతి చేయడానికి అనుగుణం గా రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని అన్నారు. జిల్లాలో కడియం మండలం లో ఉన్న నర్సరీలలో మొక్కలు , పూల మొక్కలు , పూలు ఉత్పత్తులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేయడం వల్ల మన తూర్పు గోదావరి జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. అదే విధంగా రైతులందరు నాణ్యమైన పంట ఉత్పత్తులను అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్. మాధవరావు , జిల్లా ఉద్యాన అధికారి బి సుజాత కుమారి, జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ ఏ. దుర్గేష్ ,ఆర్గానిక్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతరావు, సమన్వయంతో రైతులతో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
Prajavartha Online Telugu News