Breaking News

సుజనా చౌదరి ను పరామర్శించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడగా శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోనీ తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి అతి త్వరగా కోలుకొని తిరిగి ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *