Breaking News

ఆంధ్రప్రదేశ్ పశు సంవర్దక శాఖ లో బదిలీల ప్రక్రియ కౌన్సిలింగ్ విధానంలోనే జరగాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక లబ్బీపేట లోని పశువర్ధక శాఖ అసోసియేషన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల పశువైద్యాధికారుల జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పశువైద్య ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కౌన్సెలింగ్ విధానం లో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది 100% రాజకీయ అనుమతితో నాయకుల సిఫార్సు లెటర్ తో బదిలీలు నిర్వహించటం వలన నిబంధనలను పూర్తిగా నిర్వీర్యం అవటం జరిగిందని, మాకు ఇచ్చిన బదిలీ అప్లికేషన్ లో కూడా రాజకీయ సిఫార్సులేటర్ కంపల్సరీ అనే కాలమ్ ఉండటం చాలా బాధాకరమని, గైడ్ లైన్స్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో, ట్రైబల్ ఏరియా, ప్రాంతాలలో రెండు సంవత్సరాల పైబడి సర్వీస్ పూర్తి చేసుకున్న పశు వైద్యులు కి బదిలీల విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల సిఫార్సు తప్పనిసరి అనటం బాధాకరం, దీనివల్ల పశు వైద్యులు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పశుసంవర్ధక శాఖ కు అనేక విన్నపాలు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని బదిలీల నిర్వహణ పారదర్శకంగా జరగాలని డైరెక్టర్ దామోదర్నాయుడు కు అన్ని జిల్లాల వారు మెమోరాండం ఇచ్చి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పశు సంవర్ధక రాష్ట్ర జేఏసీ చైర్మన్ డాక్టర్ శివరామకృష్ణ రావు మరియు కో చైర్మన్ డాక్టర్. గణేశ్వర రావు సంయుక్త ప్రకటన లో తెలియ చేశారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ పశు వైద్య అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయ ప్రకాష్ గారు, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి మరియు రాష్ట్ర పశువైద్యాధికారులు సంఘం నాయకులు, వివిధ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *