Breaking News

డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ గోడౌన్‌కు పటిష్ట భద్రత..

-జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ గోడౌన్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలలో భాగంగా విజయవాడ రూరల్‌ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్ర పరిచే డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ గోడౌన్‌ను గురువారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాల ఏర్పాటను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ గోడౌన్‌ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందించడం జరుగుతుందన్నారు. గోడౌన్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. తనిఖీ ప్రక్రియలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, వై రామయ్య( టీడీపీ), తరుణ్‌ కాకాని (బిజేపి) కె. పరమేశ్వరరావు (ఏఏపి) కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ సలీమ్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *