Breaking News

మే 31న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ

-జిల్లాలో 2,27,786 పెన్ష‌న్ల‌కు రూ. 98.11 కోట్లు విడుద‌ల
-పేద‌ల సేవ‌లో స్ఫూర్తికి అనుగుణంగా పంపిణీ చేప‌ట్టండి
-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 1వ తేదీ ఆదివారం కావ‌డంతో ఈ నెల 31వ తేదీనే ఎన్‌టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని.. పేద‌ల సేవ‌లో స్ఫూర్తికి అనుగుణంగా పెన్ష‌న్లను పంపిణీ చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు.
జిల్లాలో మే 31న చేప‌ట్టే ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,27,786 పెన్ష‌న్ల‌కు దాదాపు రూ. 98.11 కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల వద్ద పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా కృషిచేయాల‌న్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీపై టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. పేద‌ల సేవ‌లో.. స్ఫూర్తికి అనుగుణంగా పెన్ష‌న్ల పంపిణీ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు సూచ‌న‌లు చేశారు. ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెన్ష‌న్ల పంపిణీ జ‌రిగేలా చూడాల‌న్నారు. పంపిణీ స‌మ‌యంలో ఇబ్బందిలేకుండా ఉండేందుకు పెన్ష‌న్ ర‌కాన్నిబ‌ట్టి న‌గ‌దు మొత్తాన్ని బండిల్‌గా సిద్ధం చేసుకోవాల‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
టెలీకాన్ఫ‌రెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *