Breaking News

జూన్ 4 తేదీన చంద్రగిరి కోట వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి…

-పెద్ద ఎత్తున ప్రజలు, యువత తదితరులు పాల్గొనేలా యోగా నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 4 తేదీన చంద్రగిరి కోట వద్ద నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, యువత తదితరులు పాల్గొనేలా చూడాలని, యోగా నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా చంద్రగిరి కోట వద్ద జూన్ 4న నిర్వహించనున్న యోగా కార్యక్రమం నిర్వహణపై జేసి శుభం బన్సల్, ఆర్డీఓ తిరుపతి రామ్మోహన్, పర్యాటక శాఖ ఆర్డి రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎంపిడిఓ, ఆర్కియాలజీ తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన చంద్రగిరి కోట వద్ద జూన్ 4న నిర్వహించనున్న యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, యువతను చంద్రగిరి, ఆర్సిపురం, తిరుపతి రూరల్ ఎంపిడిఓ లు మొబైలైజ్ చేయాలని ఆర్డీ టూరిజం సమన్వయం చేసుకోవాలని సూచించారు. జెసి గారు మొత్తం కార్యక్రమ పర్యవేక్షణ చేయాలని సూచించారు.

శానిటేషన్ సంబంధించి డిపిఓ, ఉదయం 5గం. నుండి 9 గం.ల వరకు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్డీవో తిరుపతి సమన్వయం చేయాలని అన్నారు. అలాగే త్రాగు నీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్ ఈ ఆర్ డబ్ల్యూ ఎస్ ను ఆదేశించారు. టూరిజం శాఖ వారు అన్ని ఏర్పాట్లు సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఔత్సాహిక ప్రజలు, యువత తదితరులను యోగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చూడాలని అన్నారు. యోగా పై ప్రజలకు అవగాహన కల్పించడం వారి జీవితంలో ఒక భాగంగా యోగా ఉండేలా వారిని మోటివేట్ చేయాలని అన్నారు. డ్రెస్ కోడ్ తెలుపు ఉండేలా చూడాలని అన్నారు.

సదరు చంద్రగిరి కోట వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *