-ఆర్జీలకు. త్వరితగతిన పరిష్కారం చూపాలి
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పదంతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయమునకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పిజిఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారియొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజిఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, సుధా రాణి, రోజ్ మాoడ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ -129, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ -9, పంచాయతీ రాజ్ -14, పోలీస్ శాఖ – 10, రూరల్ పావర్టీ -03, రూరల్ డెవలప్మెంట్ -2, సివిల్ సప్లై – 07, ఎస్ ఎస్ ఎల్ ఆర్ -13, ఏపీఎస్పీడిసిఎల్ -3, ఏపిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్-22
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -2,
జి ఎస్ డబ్ల్యూ ఎస్ -1, స్కూల్ ఎడ్యుకేషన్ -2, వాటర్ రిసోర్స్-3, ఫారెస్ట్-1, ఏపీఎస్ఆర్టీసీ -3,
మెడికల్ ఎడ్యుకేషన్-1, టీటీడీ -2, వ్యవసాయ శాఖ -1, సాంఘిక సంక్షేమ శాఖ-5, గిరిజన సంక్షేమ శాఖ-1, కార్మిక శాఖ -1, ఏపీఐఐసీ -1, సమగ్ర శిక్షణ-1, ఐ సి డి సి ఎస్ -1, మత్స్యశాఖ -1, విభిన్న ప్రతిభావంతుల శాఖ-1, కో-ఆపరేటివ్ సొసైటీ -1, స్కిల్ డెవలప్మెంట్-1, వెరసి మొత్తం 242 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News