-నేటి నుంచి (17.6.25) స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షల ప్రాథమిక కీ విడుదల
-ఈ నెల 23 వరకు డీఎస్సీ వెబ్ సైటులో అభ్యంతరాలు స్వీకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 38,243 అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోగా 36,372 (95.11%) మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ–2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 227 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు ఉదయం అనంతపురం జిల్లాలో (97.84%) మంది, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో (97.98%)అత్యధికంగా అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.
మైనర్ మీడియా లాంగ్వేజెస్ ‘కీ’ విడుదల
స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) మైనర్ మీడియా కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందిన ప్రాథమిక కీ నేటి (17.6.25) నుండి https://apdsc.apcfss.in వెబ్ సైటులో, రెస్పాన్స్ షీట్ అభ్యర్థుల లాగిన్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రాథమిక కీ పై తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఈ నెల 23లోపు వెబ్ సైట్ ద్వారా మాత్రమే తెలియజేయాలని మెగా డీఎస్సీ–2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు.
Prajavartha Online Telugu News