-సమస్యల పరిష్కారం కోసం 1100 నెంబర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీలు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని, అర్జీలు రీ ఓపెన్ అవ్వకుండా పరిష్కార తీరు ఉండాలని,ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియ చేశారు.
సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పిజిఆర్ఎస్ లో ప్రజల నుంచి జిల్లా అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ లో మొత్తం 177 అర్జీలు పరిష్కారం కోసం రావడం జరిగిందని, వాటిలో మండలాలు వారీగా రాజమండ్రి అర్బన్ పరిథిలో 34 , రాజమండ్రి రూరల్ 31 , కోరుకొండ 15 , రాజానగరం 13 , కడియం 12 , దేవరపల్లి 11 ఎక్కువ అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజలు అర్జీలు పరిష్కారం కోసం కలెక్టరేట్ రావడం జరుగుతోందని, ప్రజల్లో క్షేత్ర స్థాయిలో అర్జీలు ఇవ్వడం పై అవగాహన, 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చెయ్యవచ్చు అన్న విషయాన్ని ప్రచారం కల్పించడం పై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పరిష్కారం అయిన తర్వాత ఆ విషయాన్ని క్షేత్ర స్థాయిలో నిర్ధారణ చేయాలన్నారు. నేరుగా అర్జీ దారునీ కలిసి పరిష్కారం వివరాలు తెలియచేస్తూ, వాటికి సంబంధించి ఫోటో అప్లోడ్ చెయ్యాలని ఉంటుందన్నారు. రెవిన్యూ 70 , పంచాయతీ రాజ్ 21 , విద్య 21 , విద్యుత్ 14 , పోలీసు 12, ఇతర శాఖలకు చెందిన 39 అర్జీలు పరిష్కారం కోసం రావడం జరిగిందని డి ఆర్వో టి సీతారామ మూర్తి తెలిపారు.
కొన్ని అర్జీలు…
గోకవరం.. గాదెల పాలెం కు చెందిన కే. వీరబాబు గ్రామంలో ఇసుకపల్లి చెరువు గట్టు మీద అనధికార నిర్మాణం పై అర్జీ ఇవ్వడం జరిగింది
రాజమండ్రి హుకుంపేట కు చెందిన జి. శివ శంకర్ వీధి లైట్లు వెలగడం లేదని అర్జీ ఇవ్వడం జరిగింది
ధవళేశ్వరం కి చెందిన కె. గాంధీ లక్ష్మీ భూ సమస్య కి చెందిన సివిల్ తగాదా పరిష్కారం కోసం, నగదు లావాదేవీలు పై అర్జీ అందచేశారు. పోలీసులు తగిన చర్యలు విచారణ చేపట్టాలని ఆదేశించారు.
పెరవలి మండలం కాపవరం కి చెందిన ఏ వి సత్యనారాయణ తన భూమి రీ సర్వే చేయాలని అర్జీ అందచేశారు.
దివాన్ చెరువు కి చెందిన ఎన్ ఎస్ డి గణేష్ గంజివారి రోడ్డు మార్గంలో రహదారి, డ్రైయినేజీ సమస్య పరిష్కారం కోసం అర్జీ ఇవ్వడం జరిగింది.
పీజిఆర్ఎస్ లో సిపివో జేడీ ఎల్ అప్పల కొండ, డీఎల్డివో లు పి వీణాదేవి, ఏ స్లీవా రెడ్డి, పోలీసు , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News