Breaking News

యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలి: డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయుల సనాతన సంపద అయిన యోగాను తమ జీవనశైలిలో ప్రతిఒక్కరూ భాగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ సూచించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ వద్ద సోమవారం జరిగిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాస‌నాలు అభ్య‌సించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ప్రసంగిస్తూ.. యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేందుకు యోగాంధ్ర –2025 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా నేటి యువత యోగ సాధన పట్ల మక్కువ పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేయవచ్చని.. కనుక తల్లితండ్రులు, గురువులు తమ పిల్లలను యోగా వైపు ప్రోత్సహించాలని కోరారు. ప్రతిరోజు యోగా, వ్యాయామంతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చన్నారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. కనుక నగర ప్రజలు యోగా విశిష్టతను గుర్తించి ప్రయోజనం పొందాలని సూచించారు. కార్యక్రమంలో సెక్రటరీ జి.శైలజావల్లి, ఎస్ఈ(ఇంజనీరింగ్) ఎం.సీహెచ్.కోటేశ్వరరావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, సీఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ పి.వి.బి.రమణరావు, రెవెన్యూ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *