ఏక కాలంలో స్వామిత్వ, రీ సర్వే పనులు చేపట్టాలి

-యోగేంద్ర కింద నమోదు అయిన వారి వివరాలు శిక్షకులతో మ్యాపింగ్ చెయ్యాలి
-జూన్ 21 జిల్లా స్థాయి యోగా ఆంధ్ర జి టి రోడ్డులో…
-మెటీరియల్ కాంపోనెంట్ లేబర్ కాంపోనేంట్ ఆధారంగా ఉంటుంది
-ప్రకృతి వ్యవసాయ సాగు చేసే రైతులకి ఎల్ బండ్ కోసం ఉపాధిహామీ పథకం ద్వారా చేయూత
-హౌసింగ్ నిర్మాణంలో వెనుకబడిన 5 మండలాల్లో కేసు స్టడీ చెయ్యండి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా ఆంధ్రా ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నమోదు అయిన వారి వివరాలు యోగా శిక్షకులతో మ్యాపింగ్ చేయడం, తగిన ప్రదేశాలతో అనుసంధానం చెయ్యాలని , వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యోగా ఆంధ్రా, స్వామిత్వ, ఉపాధి హామీ, హౌసింగ్, సీసీఆర్సీ కార్డులు నమోదు చెయ్యడం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధిహామీ పథకం కింద 30,16,588 పని దినాలు లక్ష్యాలకు సంబంధించిన ఇప్పటి వరకు 22,62,968 పని దినాలు లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగంలో చేపట్టే పనులను అనుసంధానం చెయ్యడం జరిగిందని తెలిపారు.

రీ సర్వే, స్వామిత్వ సర్వే పనుల విషయంలో రెండింటినీ సమాంతరంగా చేపట్టాల్సి అవసరం ఉందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మద్దూరు, పశివేదల గ్రామాల్లో మంగళవారం క్షేత్ర స్థాయిలో స్వామిత్వ సర్వే పనుల ప్రక్రియ పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో డివిజన్ స్థాయిలో వెనుక బడిన మండలాల్లో రెండు గ్రామాల్లో డివిజనల్ పంచాయితీ అధికారులు పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు.

హౌసింగ్ నిర్మాణం చేపట్టడం లో భాగంగా హౌసింగ్ డి ఈ లు జిల్లాలో ఐదు లే అవుట్ లలో లబ్ధిదారులతో మాట్లాడి, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు, వాటిని అధిగమించే క్రమంలో చేపట్టవలసిన అంశాలపై కేసు స్టడీ చేసి నివేదిక అందచేయాలని ఆదేశించారు. జిల్లాలో హౌసింగ్ కోసం నిర్దేశించిన లక్ష్యాలలో 57 శాతం పూర్తి చేశారని, ఇంకా 43 శాతం పనులు చేయడం లో స్టేజి కన్వర్షన్ విధానంలో దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం అదనపు ఆర్ధిక సహాయం అందించినా పురోగతి పై సమీక్షించాలని పేర్కొన్నారు.

తల్లికి వందనం కింద మండల విద్య అధికారులు ద్వారా లబ్ధిదారుల తో కూడి నియోజక వర్గ స్థాయిలో ప్రత్యేక వేడుక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,89,143 మంది తల్లికి వందనం కింద ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపారు. ఇంకా అర్హత కలిగి ఉండి ఎవరైనా జాబితా లో లేని యెడల సంబంధిత సచివాలయం పరిధిలో తగిన వివరాలు ఇవ్వాలన్నారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ విషయంలో రాజకీయ పార్టీలతో నియోజక వర్గాల పరిథిలో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. ఇందుకు సంబంధించి 1037 సర్క్యులర్ లో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లు హేతు బద్ధత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమేరకు రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

కౌలు రైతులకు సంబంధించి 1,10,000 మందికి సి సి ఆర్ సి కార్డులు జారీ చెయ్యాలి ఉందన్నారు. ఇప్పటి వరకూ 17,605 మందికి చెందిన వివరాలు మాత్రమే నమోదు చేసినట్లు తెలిపారు. నూరు శాతం లక్ష్యం కోసం గ్రామ రెవెన్యూ, వ్యవసాయ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు.

జూన్ 21 యోగా ఆంధ్రా సాధన కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరీ భాగస్వామ్యం కీలకంఅని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. జూన్ 14 వ తేదీన నిర్వహించిన యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అయితే వాటికి సంబంధించి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయడం పై సమన్వయ శాఖల మధ్య సరైన అవగాహన లేకుండా ఉందన్నారు. జిల్లాలో 7,75,458 మంది 5,623 లోకేషన్స్ లో యోగా సాధన కోసం స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగిందన్నారు. వీటికి సంబంధించిన ఆయా ప్రాంతాల్లో 5548 మంది మాస్టర్ ట్రైనర్స్ గుర్తించి టాగింగ్ చేయాలన్నారు. 4521 మందికి చెందిన వివరాలు మాత్రమే అప్లోడ్ చేసినట్లు తెలిపారు. జూన్ 20 , 21 తేదీల్లో యోగాంధ్రా సామూహిక సాధన చేయడం, వాటికి సంబంధించి ఫోటోలు, వీడియో లు 20 నిమిషాల్లో అప్లోడ్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కేవలం యోగా మాస్టర్ ట్రైనర్స్ తో 1,18,000 వేల మందినీ మాత్రమే మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్లు, ఎంపిడివో సచివాలయ సిబ్బంది అధ్వర్యంలో ప్రాంతాల వారి మ్యాపింగ్ చేయడం లో తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నియోజక వర్గాల పరిథిలో యోగా సాధన కార్యక్రమం జూన్ 21 న స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి ముందుగా ప్రాంతాలను గుర్తించి అక్కడ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, సిపివో/జేడి ఎల్. అప్పల కొండ, డ్వామా పీడి ఎమ్. నాగమల్లేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమణ, డీఎల్ డివో పి వీణాదేవి, జిల్లా పంచాయతీ అధికారి వి శాంతా మణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *