విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత 40 రోజులుగా తమ న్యాయమైన సమస్యల కోసం కాంట్రాక్ట్ కార్మికులను రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో రెగ్యులర్ చేయాలని ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాలో పాల్గొన్న దోనేపూడి శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికులను రెగ్యులర్ చేయలేదని తుంగలో తొక్కిందని ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైజ్ చేసి వారికి జీవనోపాధి కలిగించాలని కట్టు బానిసల్లాగా చూస్తున్నారని కనీసం వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సిబ్బందికి గ్లౌజెస్ గానీ, కొబ్బరి నూనె గాని, సబ్బు బిళ్ళలు గాని ఇవ్వటం లేదని, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ కట్టు బానిసల్లాగా కార్మికులను చూస్తున్నారని 10 గంటల దినాన్ని అప్రకటితంగా అమలు చేస్తున్నారని ఇది శోచనీయమని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి వారి జీతభత్యాలను పెంచి వారికి రావలసిన రాయితీలను వెంటనే ప్రకటించాలని సిపిఐ పూర్తి సంఘీభావాన్ని వారి పోరాటానికి ప్రకటించింది
ఏఐటియుసి నగర కార్యదర్శి కొట్టు రమణ రావు ప్రసంగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తున్న మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పట్ల ఏఐటియుసి సానుకూలంగా ఉందని వారి పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం తక్షణమే నిమ్మకు నకాకుండా తక్షణమే రెగ్యులర్ చేయాలని కార్మికుల పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించారు సంఘీభావాలు ప్రకటించిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తాడిపడియా కూడా ఉన్నారు.
Prajavartha Online Telugu News