-ఈవీఎం గోడౌన్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్ వెంకటేశ్వర్
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24×7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మార్గదర్శకాలు ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్ర పరచబడిన ఈవీఎం గోదామును శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేసారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్ నందు సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవిఎం గోడౌన్ ఇంఛార్జి మరియు ఎస్డిసి సుధారాణి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, రేణిగుంట తహశీల్దార్ చంద్రశేఖర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News