గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో 35 ప్రశ్నలు, 105 ప్రియాంబుల్స్, ప్రతిపాదనలు ఆమోదం ద్వారా నగర పరిధిలోని ప్రతి వార్డ్ లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టడానికి అవకాశం కల్గిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం మేయర్ అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన నగరపాలక సాదారణ సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మేల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి,డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తొలుత ఇటీవల కాలంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి, అలాగే మాజీ కార్పొరేటర్ కారసాని సామ్రాజ్యం మృతికి 2 నిమిషాలు కౌన్సిల్ మౌనం పాటించడం జరిగింది.
Prajavartha Online Telugu News