స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి పాఠశాల శ్రీ పాండురంగ విద్యాలయం మూత

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్యోద్యమ కాలం లో…..1938 సంవత్సరం లో గుంటూరు 6/5 బ్రాడీపేట లో దివంగత కొండపాలూరి లక్ష్మీనరసింహారావు స్థాపించిన ఎయిడెడ్ పాఠశాల శ్రీ పాండురంగ విద్యాలయం మూతపడింది. గడచిన 87 ఏళ్ల కాలంలో ఈ పాఠశాల వేలాది మంది బాలబాలికలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దింది. వయో వృద్ధ భారంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక……అన్నింటిమించి తగినంత మంది విద్యార్థులు లేక ప్రస్తుతం ఉన్న సిబ్బంది.. విద్యార్థులను విద్యాశాఖ కు అప్పగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మేనేజర్ కె ఎస్ బి తిలక్ తెలిపారు.వీరు గతంలో 20 ఏళ్ల పాటు ఆంధ్రపత్రిక లో సబ్ ఎడిటర్ గా పని చేశారని వీరి మేనమామ భద్రరాజు కృష్ణమూర్తి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ లో సుదీర్ఘ కాలం వైస్ ఛాన్సలర్ గా పని చేశారని ఆ విద్యాసంస్థ తో నాలుగు దశాబ్దాలు పైగా సాన్నిహిత్యం కల్గిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు తెలిపారు. ఆంధ్రపత్రిక లో పనిచేస్తూనే 1984 – 86 మధ్య కాలంలో ప్రకాశం జిల్లా మొగిలిచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా పని చేసిన తనకు ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల పని తీరు, స్థితిగతులు తనకు బాగా తెలుసని ఈ సందర్భంగా నిమ్మరాజు తెలిపారు. ప్రస్తుత పోటీతత్వాన్ని ఎదుర్కోలేక క్రమేణ మూతబడుతున్నాయని అన్నారు. ప్రధానంగా ఏళ్ల తరబడి సిబ్బంది ఖాళీల భర్తీ లేకపోగా కనీసం మెయింటెనన్స్ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *