అజ్జరం ఇత్తడి కళాకారుల జ్ఞాపికను సీఎం చంద్రబాబుకు బహుకరణ

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

కొవ్వూరు (మలకపల్లి, తాళ్లపూడి), నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా అజ్జరం గ్రామంలో ఇత్తడి వస్తువుల తయారీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న 300 కుటుంబాల పరిస్థితిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వివరించారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున అజ్జరం గ్రామంలోని కళాకారులు తయారు చేసిన ఇత్తడి డిన్నర్ సెట్‌ను జ్ఞాపికగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర అధికారులతో కలిసి బహుకరించారు.

ఈ సందర్భంగా ఇత్తడి వస్తువుల తయారీ పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ లో అవకాశాలు, ఆయా కుటుంబాలకు అవసరమైన మద్దతు, శిక్షణ, మరియు ప్రోత్సాహకాలు గురించి కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అజ్జరం – చేతివృత్తుల వారసత్వానికి ప్రతిరూపం అని అజ్జరం గ్రామం రెండు శతాబ్దాల నాటికి చెందిన చేతివృత్తుల సంప్రదాయాన్ని కలిగి ఉందనీ వివరించారు. ఇక్కడి కళాకారులు ఇత్తడి మరియు కాంస్యంతో మతపరమైన ఆచారాల్లో ఉపయోగించే పవిత్ర పాత్రలను శ్రద్ధతో తయారు చేస్తున్నారనీ, వారి కళాత్మకత, సంక్లిష్టమైన పనితనానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతివృత్తుల వారసత్వాన్ని గుర్తించి, వారిని ప్రోత్సహించినందుకు ముఖ్యమంత్రికి అజ్జరం కళాకారులు తరపున కలెక్టర్ కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఆర్డీవో రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *