డీఎస్సీ పరీక్షల వివిధ సబ్జెక్టుల ప్రాథమిక కీ విడుదల

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీలో భాగంగా జూన్ 6 నుండి జూన్ 28 వరకు జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను గురువారం నుండి మెగా డీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అందుబాటులో ‘ప్రాథమిక కీ’లు 
• పీజీటీ విభాగంలో కామర్స్, ఇంగ్లీష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్, తెలుగు;
• స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్;
• ఎస్జీటీ విభాగంలో ఎస్జీటీ జనరల్, ఎస్‌జీటీ – స్పెషల్ హెచ్‌హెచ్ (వినికిడి లోపం ఉన్నవారికి ), ఎస్‌జీటీ – స్పెషల్ వీహెచ్ (దృష్టి లోపం ఉన్నవారికి ప్రత్యేక ఎస్‌జీటీ);
• టీజీటీ విభాగంలో ఇంగ్లీష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సైన్స్ (విజ్ఞాన శాస్త్రం), సోషల్, తెలుగు;
• ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష (ENGLISH PROFICIENCY TEST)
• పీఈటీ – హెచ్‌హెచ్ (వినికిడి లోపం ఉన్నవారికి – Hearing Impaired), పీఈటీ – వీహెచ్ (దృష్టి లోపం ఉన్నవారికి – Visually Impaired), PHYSICAL EDUCATION TEACHER (PET) – ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షలకు సంబంధించి అన్ని మాధ్యమాల కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లను పరిశీలించి, ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత ఆధారాలతో జూలై 11 లోపు https://apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని తెలిపారు. జూన్ 29 నుండి జూలై 2 వరకు జరిగే పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు కూడా త్వరలో విడుదల చేస్తామమని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి  తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *