-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర సుందరీకరణకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, వన్ టౌన్, ఎంజీ రోడ్, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సుందరీకరణకు ప్రత్యేక దృష్టి వహించాలని అన్నారు. నిర్మాణ వ్యర్ధాలు, కేబుల్ వైర్ లు నగర సుందరికరణానికి భంగం కలిగించేలా కనిపించినా వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ప్రతిరోజు ప్లానింగ్ సెక్రెటరీలు ఫీల్డ్ లో తిరిగి నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడా లేకుండా చూసుకోవాలని అధికారులకు ఎప్పటికప్పుడు వాటిపై నివేదికను సమర్పించాలని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచాలని ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రపరుస్తూ, వ్యర్ధాలను వెంటనే తొలగిస్తూ ఉండాలని ప్రజారోగ్య సిబ్బందికి తెలిపారు. పగిలిపోయిన ఫుట్ పాత్ లు, పాడైపోయిన డివైడర్లు గుంతలు పడిన రోడ్లను ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటూ మరమ్మతులు చేయిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి. సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News