Breaking News

అన్నదాత సుఖీభవ జాబితాలో పేరు లేదా! ఇలా తెలుసుకోండి…

-అయితా. నాగేశ్వరావు, సంయుక్త వ్యవసాయ సంచాలకులు, గుంటూరు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రం ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు, రూ.11 వేలు కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.20 వేలు రైతులకు అందిస్తోంది. అర్హత ఉండి… లబ్దిదారుల జాబి తాలో పేరు లేని వారు కారణం తెలుసుకుని సంబంధిత పత్రాలు అందజేస్తే వ్యవసాయ శాఖ సిబ్బంది సరిచేస్తారు.. రైతు సేవా కేంద్రాల్లో జాబితాలు ప్రదర్శించినందున రైతులు వాటిని పరిశీలించి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే నష్టపోయే ప్రమాదం వుంది… వాట్సాప్ ద్వారా తనిఖీ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం రైతులు మన మిత్ర ( 95523 00009) నెంబర్ కి హాయ్ అని సందేశం పంపిస్తే, సేవలను ఎంచుకోండి అని వస్తుంది, మీరు అందులో మొదటి వరసలో ఉండే అన్నదాత సుఖీభవ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి, వెంటనే లబ్ధిదారుని పేరు తండ్రి పేరు గ్రామం, మండలం మొదలగు సమాచారం వస్తుంది, అందులో మీరు అర్హుల అనర్హుల అని కూడా వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా వస్తుంది. మీ ఈ కేవైసీ పూర్తయిందా లేదా అనే వివరాలు కూడా వస్తాయి.
అర్హత ఉన్న ప్రతి రైతుకు సాయం అందించాలన్న లక్ష్యంతో గ్రీవెన్స్ అవకాశం కల్పించింది. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు సాయం అందించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రధానంగా ఎదురవుతున్న సమ స్యలకు పరిష్కారాలు ఇలా ఉన్నాయి.

* భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు, కౌలు గుర్తింపు కార్హులు పొందాలి. ఖరీప్ ర పంటలో వివరాలు నమోదు చేసుకోవాలి. అర్హత ఉన్న వారికి రూ.20 వేలు సాయాన్ని మూడు వీడతల్లో అందజేస్తారు.
* డి-పట్టాదారులు ఆసైన్డ్ భూములు, ఇనాం భూములు సాగు చేసేవారందరూ పథకానికి అర్హులే. పటుంబంలో ఒకరు మాత్రమే పథకానికి అర్హులు. ఒకే కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉన్నట్లయితే గ్రామ, వార్డు సదివాలయాల్లో కుటుంబ సర్వేలో వేరు చేయించుకోవాలి.
* రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ లు దరఖాస్తు చేసుకోవాలి.
* వెబ్ ల్యాండ్ లో రైతు ఆధార్ నంబరు తప్పుగా అనుసంధానం చేసి ఉంటే రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి సరైన ఆధార్ నంబరును అనుసంధానం చేయించుకోవాలి.
* వెబ్ ల్యాండ్ లో ఆధార్ తో జత కాలేదని గుర్తించినా.. చని పోయిన వారి భూమి మ్యూటేషన్ జరగకపోయినా, వెబ్ ల్యాండ్ కు సంబంధించిన కారణాలు ఏమైనా ఉంటే వీఆర్వో, తహసీల్దారు ద్వారా సరిచేసుకోవాలి.
* అనంతరం రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అటవీ భూమి సాగుదారులు.. గిరి భూమి పోర్టల్లో సమస్యలు ఉంటే గిరిజన సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి, ఆధార్ తప్పుగా నమోదైనా మ్యూటేషన్ కోసం పీఓను సంప్రదించి సరిచేసుకోవాలి.
* రైతుల పేర్లు పరిశీలనలోకి రాలేదంటే వారి భూమి రెవెన్యూ వెబ్ల్యండ్లో ఆధార్లో అతకాలేదని గుర్తించాలి, రెవెన్యూ అధికారిని సంప్రదించి ఆధార్ను వెబ్ ల్యాండ్ రికార్డులతో అనుసంధానం చేసుకుని అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
* దేవాదాయ భూముల్లో సాగు చేస్తున్న వారిని కౌలు రైతుల కింద గుర్తించి పెట్టుబడి సాయం అందిస్తారు.

మన జిల్లాలో:
జిల్లా వ్యాప్తంగా 2,64,566 మంది రైతులు ఉండగా 2,21,317 మంది రైతులకు ఈ కైవైసీ పూర్తయింది. మిగిలిన రైతులకు వివిధ కారణాలతో ఈ కేవైసీ కాలేదు. అన్నదాత సుఖీభవ పధకానికి అర్హత ఉండి పేరు లేదని భావిస్తే సదరు రైతు ఆర్జీతోపాటు అవసరమైన పత్రాలను రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలి. ఈ నెల 13 వరకు ఫిర్యాదుకు అవకాశం వుంది.వ్యవసాయఅ ధికారి టెక్నికల్ వారి నెంబర్ 8331056914 నకు కాల్ చేసి సందేహములను నివృత్తి చేసుకొనవచ్చును.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *