విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధి మరియు శిక్షణ శాఖ వారు విజయవాడలో ఉన్న ఉపాధి కార్యాలయం నందు గల నైపుణ్య కేంద్రం నందు 10వ తరగతి, మరియూ 10+2 మరియూ ఏదైన డిగ్రీ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్ధులకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోర్సు నందు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వబడును.
ఈ కోర్సునకు ఎంపికైన విద్యార్ధులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ కల్పించబడును. శిక్షణ కోరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు NTR జిల్లా ఉపాధి అధికారి, విజయవాడ శ్రీ సి మధుభూషణరావు గారు మరియు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారు తెలియజేసారు.శిక్షణ అనంతరము ప్రముఖ సంస్థలయందు ఉద్యోగములు కల్పించబడతాయని తెలియజేస్తున్నారు. కావున ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 14-08-2025 లోపుగా నమోదు చేసుకోవలసిందిగా మరియు కోర్సు పూర్తి చేసిన అభ్యర్దులకు సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. ఇందు నిమితం అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ తో జిల్లా ఉపాధి కార్యాలయం విజయవాడ నందు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చును.
పూర్తి వివరాలకు
8142416211 – Jayaraju garu
9347779032 –Ramya garu
పై నెంబర్లను సంప్రదించగలరు
స్కిల్ హబ్ సెంటర్ మరియూ కోర్సు నకు సంబంధంచిన వివరాలు కింద గమనించగలరు
స్కిల్ హబ్ కోర్సు : కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్
అర్హత : 10వ తరగతి, మరియూ 10+2 మరియూ ఏదైన డిగ్రీ/డిప్లొమా అర్హత
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ :
9347779032 – Ramya garu
Address : District Employment Office, Govt ITI Compound, Dr.Ramesh Hospital Road, Vijayawada
Prajavartha Online Telugu News