వే ఫౌండేషన్ సంస్థ అందించిన వెయ్యి అడుగుల జాతీయ జండా తో ప్రదర్శన ర్యాలీ…

-తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్.వి యునివర్సిటీ వారి భాగస్వామ్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్.వి యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థినీ విద్యార్థులతో పెద్ద ఎత్తున నిర్వహించిన వెయ్యి అడుగుల త్రివర్ణ పథాక ప్రదర్శన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రెండు వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపియున్నారన్నారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ రోజు వే ఫౌండేషన్ సంస్థ అందించిన వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాల సంతోషంగా ఉందన్నారు. భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవడానికి యువత కృషి చేయాలి. దేశం యొక్క పురోగతి గురించి అపోహలు తొలగించి, దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటునందించాలని తెలిపారు.
మున్సిపల్ కమీషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ గతంలో కేవలం ఆఫీసులు, సంస్థల్లో మాత్రమే జెండా ఎగురవేసేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో జెండా ఎగురవేసేలా ప్రోత్సహించడానికి రెండు వారాల కార్యక్రమం ప్రారంభించారు. సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తిని ఒక రోజుకే పరిమితం చేయకుండా, ప్రతిరోజూ మన పనుల్లో ఆ స్ఫూర్తి కనిపించాలి. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ప్రతిరోజూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, టూరిజం ఆర్ డి రమణప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్ధన్ , ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *