Breaking News

సమిష్టిగా దసరా ఉత్సవాలు

-దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారుల, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో, సమిస్టిగా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ ( సుజనా చౌదరి) స్పష్టం చేశారు. విజయవాడ లోని ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం జమ్మి దొడ్డి కార్యాలయంలో జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయదశమి వేడుకలను సమిష్టిగా విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, ఈవో శీనా నాయక్ ఆలయ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్ష లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీ మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. ఈ ఏడాది కొత్తగా కాత్యాయని దేవి అలంకరణ ఉంటుందని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేక శ్రద్ధతో దసరా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి, అధికారులు , పోలీసులు, ప్రజా ప్రతినిధుల, సమన్వయంతో సమిస్టిగా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు

ఇంద్రకీలాద్రి ఖ్యాతి పెరిగేలా దసరా ఉత్సవాల నిర్వహణ
ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ గత యేడాది నిర్వహించిన దసరా ఉత్సవాలు మంచి సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు ముందస్తుగానే ఏర్పాట్లు చేసి మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి స్వచ్ఛమైన మినరల్ వాటర్ బాటిళ్లను అందించడం, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ,పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ , త్వరితగతిన శీఘ్ర దర్శనం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఉత్సవాల సమయంలో ఆలయ అధికారులు బడ్జెట్ వేసుకోవాలని అనవసరమైన ఖర్చులను గుర్తించి తగ్గించాలన్నారు. ముందే బడ్జెట్ వేసుకొని ఎయే అవసరాలకు ఎంత ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోవాలన్నారు. ఇంద్రకీలాద్రి ఖ్యాతి పెరిగేలా ఉత్సవాల నిర్వహణ జరగాలన్నారు. అవసరమైతే దాతల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. ఆలయ సిబ్బంది, వాలంటీర్లకు డ్రెస్ కోడ్ కేటాయించి అమలు చేయాలన్నారు. క్యూ లైన్ల లోని భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా టెక్నాలజీ సాయంతో హోల్డింగ్ ఏరియాలలోనీ భక్తులను గుర్తించడం ద్వారా వారికి శీఘ్ర దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయవచ్చని తెలిపారు.

అధికారులు , పోలీసులు, ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో రానున్న దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *