తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీనివాసమంగాపురంలోని… శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు భక్తుల సౌకర్యార్థం. ..
“కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని శ్రీవారి భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలితో పూజ చేయించారు. అనంతరం డిప్యూటీ ఈవో శాంతి మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం లోని కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఇందుకు సహకరించిన చంద్రగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం డిప్యూటీ ఈవో శాంతి చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి తలనీలాల కేంద్రాన్ని ప్రారంభించారు. తిరుమలకు వెళ్ళలేని భక్తులు శ్రీనివాస మంగాపురం వచ్చి ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి దైవ దర్శనం చేసుకోవచ్చని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు, అర్చకస్వాములు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News