విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం నందు కొలువై యున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవముల సందర్భముగా సోమవారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి తరుపున శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం చేరుకోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి A.వెంకటేశు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ కోవిడ్ నిబందనలు పాటిస్తూ, పట్టువస్త్రములతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనము చేసుకొని, పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం శ్రీ స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి A.వెంకటేశు దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారికి స్వామివారి చిత్రపటము, శేషవస్త్రము మరియు ప్రసాదములు అందజేసినారు. ఈ కార్యక్రమములో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, ఆర్.శ్రీనివాస శాస్త్రి , ఆలయ అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు మరియు ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News