రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్‌కే)ల‌ను ప్రారంభం

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌.టి.ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్‌.ఇలక్కియ శుక్ర‌వారం తిరువూరు మండలం, మునకుల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్‌కే)ల‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇల‌క్కియ‌.. రైతులతో ముఖాముఖీగా సమావేశమై, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (ఎంఎస్‌పీ)ల‌కే ధాన్యం విక్రయించవలసిందిగా సూచించారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఎండబెట్టి, నిర్దేశ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసి విక్రయం చేయాలని సూచించారు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ధాన్యం రవాణాను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, ఇతర రైతుల ధాన్యం రవాణాలో భాగస్వాములై అదనపు ఆదాయం పొంద‌వ‌చ్చ‌ని వివరించారు.

తిరువూరు మండలంలోని వాహిని కాలేజీలో నిర్వహించిన *“ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంలో జాయింట్ క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ టి.వి. సతీష్, తిరువూరు డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కె.మాధురి గారు, మొత్తం 59 ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీల ప్రతినిధులు, తహసీల్దార్లు, మండ‌ల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్.. ధాన్యం కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ధాన్యంలో తేమ శాతం (Moisture Content) తనిఖీ ప్రాధాన్యం త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. కార్యక్రమంలో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్లు తీసుకున్న శిక్ష‌ణ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌నున్నామ‌ని.. రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల ద్వారా గరిష్ఠ ప్రయోజనం క‌లిగేలా కృషిచేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *