Breaking News

విపత్తులపై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం

-ఆపత్సమయంలో సురక్షితంగా బయటపడటానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని అందరూ తెలుసుకోవాలి.
-విపత్తు సన్నద్ధతపై గొల్లపూడి లో నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతం
-విజయవాడ ఆర్ డి ఓ కావూరి చైతన్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరదలు, భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తు సందర్భాలలో సురక్షితంగా బయటపడడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రజలకు తెలిపేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశం మేరకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు విజయవాడ ఆర్డిఓ కే చైతన్య చెప్పారు.
రాష్ట్ర విపత్తు స్పందన దళం నేతృత్వంలో గొల్లపూడి ఘాట్ వద్ద నిర్వహించిన ఈ మాక్ ఎక్సర్సైజ్ లో… రెవిన్యూ, అగ్నిమాపక, పశుసంవర్ధక, పోలీస్, వైద్య, పంచాయతీరాజ్, మహిళ & శిశు సంక్షేమ శాఖల. సిబ్బంది పాల్గొన్నారు. ఆయా విపత్తుల సమయంలో సన్నద్ధత, తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు.

ముఖ్యంగా వరదల సమయంలో నీటిలో మునిగిపోయిన వ్యక్తిని ఎలా రక్షించాలి, సి ఆర్ పి ఎలా చేయాలి అనే విషయాలను ప్రజలకు తెలియజేశారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఎలా రక్షించాలో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది చూపగా, సిఆర్పి చేసే విధానాన్ని వైద్య శాఖ సిబ్బంది వివరించారు.

వరదల సమయంలో మనుషులతో పాటు పశువులను రక్షించే విధానాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేశారు.తుపానులు, వరదల సమయంలో పశువులను సురక్షితమైన, ఎత్తైన ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలని, పశువులను కట్టివేసి ఉంచకుండా, స్వేచ్ఛగా వదిలి పెట్టాలని చెప్పారు. విపత్తుల సమయంలో పశువులు గొంతువాపు వ్యాధికి గురవుతాయని దీనిపై దృష్టి సారించాలని తెలిపారు. యంత్రాల సాయంతో పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పద్ధతిని ప్రజలకు వివరించారు.

పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయటం, నిర్వహించడం, పిల్లలకు విద్య అందించడం వంటి అంశాలను కూడా మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో సుహాసిని, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఏవి శంకర్రావు, విజయవాడ గ్రామీణ తహసిల్దార్ బి సుగుణ, ఎంపీడీవో విగ్గిన్స్, ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *