-పలు గ్రామాల్లో అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం
-అక్కపాలెం, మునుకుళ్ల,వావిలాల, రాజుగూడెం, పెద్దవరం, ఎర్రమడు గ్రామాల్లో జరిగిన సమీక్షా సమావేశం
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు రూరల్ మండలం అక్కపాలెం, మునుకుళ్ల, వావిలాల , రాజుగూడెం, పెద్దవరం, ఎర్రమడు గ్రామాల్లో గ్రామాభివృద్దిపై ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులు, ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరు రూరల్ మండలంలో గురువారం పర్యటించారు.
అక్కలపాలెం లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆ గ్రామంలో వున్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో స్మశానం రోడ్డు బాగు చేయటంతో పాటు స్మశానం బాగు చేయించాలని కోరటంతోపాటు, అసంతృప్తి మిగిలిపోయిన సచివాలయం నిర్మాణం పూర్తిచేయాలని, లీకేజీ ఉన్న పైప్ లైన్లు బాగు చేయించాలని కరెంటు సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.. అధికారులు ఎమ్మార్వో నాగమణి, ఎండిఓ సిహెచ్ రవిబాబు, ఏపీవో మాధవరెడ్డి, డి ఈ ఈ లక్ష్మణరావు లతో మాట్లాడి ఆ సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించి ప్రారంభోత్సవానికి వస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అలాగే తిరువూరు అక్కపాలెం రహదారి మధ్య సిసి రోడ్ సాంక్షన్ అయినట్లు తెలియజేసారు..
అనంతరం మనకుళ్ల గ్రామం లో అధికారులు, గ్రామస్తులతో గ్రామా భివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు బిసి, ఎస్సి కాలనీలలో మిగిలిన సిసి రోడ్లు పూర్తిచేయాలని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, హై స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు.. ఆ సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
వావిలాల గ్రామం లో అధికారులు, గ్రామస్తులతో గ్రామా భివృద్ధి పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వావిలాల నుంచి వాముకుంట్ల లింకు రోడ్డు, గ్రామంలో గ్రాంట్ అయిన హై స్కూల్ కు స్థలం ఏర్పాటు చేయించాలని ప్రజలు కోరారు.. ఈ సమస్యను రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తానని ఎంపీ ప్రజలకు తెలియజేశారు
రాజుగూడెం లో కూడా ఎంపీ కేశినేని శివనాథ్ నిర్వహించిన గ్రామాభివృద్ధి పై సమీక్ష సమావేశంలో ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు
పెద్దవరం లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాజు గూడెం పెద్దవరం రహదారిరహదారి, చెరువులకు అలుగులను ఏర్పాటు చేయాలని కోరారు..
ఎర్రమడు గ్రామంలో ఆర్వో ప్లాంట్, బిసి కాలనీ లో సిసి రోడ్లు, పైప్ లైన్ సమస్య పరిష్కరించాలని ప్రజలకు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు..
ఈ సమీక్ష సమావేశాల్లో గ్రామ సర్పంచి రవి
తిరువూరు మండలం పార్టీ అధ్యక్షులు దబ్బాక వెంకటేశ్వర్లు, పిక్లా నాయక్, మల్లెల శ్రీనివాసరావు, రా యన సుబ్బారావు,
గ్రామ పార్టీ అధ్యక్షులు, పాల యూనియన్ అధ్యక్షుడు నెక్కడపు శ్రీనివాసరావు,
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవ దత్తు, నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాసరావు, తెలుగు యువత స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి ఆసీస్ లాల్, తిరువూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, తిరువూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పరస పుల్లారావు లతో పాటు తదితరులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News