Breaking News

నూతనంగా నియమితులైన బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు 184వ బోర్డు సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశం చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ సమక్షంలో జరగగా, వైస్ చైర్మన్ విశ్వ హాజరయ్యారు. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన బోర్డు సభ్యులు తమ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన బోర్డు సభ్యులుగా సోమశేఖర్ (పెనుకొండ – టీడీపీ), పుట్టం శ్రీనివాసులు రెడ్డి (ఆత్మకూరు, నెల్లూరు జిల్లా – టీడీపీ), జీవిత గంగల్ల (విశాఖపట్నం తూర్పు – టీడీపీ), ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రసాద్ (అమలాపురం – జనసేన), తమ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం హస్తకళలను, హస్తకళాకారులను అండగా నిలబెట్టే దిశగా కట్టుబడి ఉంది. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ కింద దాదాపు 36 ఉత్పత్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న కళాకారులకు అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించే చర్యలు తీసుకుంటాము. హస్తకళాకారుల సంక్షేమం, వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం, లెపాక్షి బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని” అన్నారు.

నూతన బోర్డు సమావేశంలో హస్తకళలను పెంపొందించడం, హస్తకళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం ప్రధాన చర్చనీయాంశాలు. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ కింద 36 ఉత్పత్తులను ప్రోత్సహించడం గురించి చర్చించారు. కళాకారులకు అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించడం, సంస్థను అభివృద్ధి చేయడం, రాష్ట్ర హస్తకళల వైభవాన్ని దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తరింపజేయడం వంటి లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి. బోర్డు సభ్యులు కళాకారులకు అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను తీర్చేందుకు కృషి చేయాలని, హస్తకళలను అభివృద్ధి చేసే దిశగా నిరంతరంగా శ్రమించాలని నిర్ణయించారు. కార్పొరేషన్‌ను దేశంలోనే అత్యుత్తమమైన స్థానంలో నిలబెట్టేలా పనిచేయాలని, రాష్ట్ర మరియు కేంద్ర కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ సహాయాన్ని అందిస్తూ కళాకారులకు మద్దతు ఇవ్వాలని సంకల్పం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *