Breaking News

APSPF ఆవిర్భావ దినోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం APSPF ఆవిర్భావ దినోత్సవం 2025 tతేది:23.10.2025 నాడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు నందు డైరెక్టర్ జనరల్ Dr. త్రివిక్రమ వర్మ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ బి.వి.రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత హాజరు కావాల్సి ఉండగా, కొన్ని అనివార కారణములు ఆమె రాలేకపోయారు. ఆమె స్థానంలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆవిర్భావ దినోత్సవo సందర్భంగా మాట్లాడుతూ SPF ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఘనంగా ఉన్నదని, ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి డా. త్రివిక్రమ్ వర్మ DG ని మరియు ఇతర అధికారులను సిబ్బందిని ప్రసంశించారు. అలాగే, SPF ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి 2000 బ్యాచ్ కానిస్టేబుల్స్ ను అప్గ్రేడ్ చేయుటకు ప్రభుత్వ పరిశీలనలో ఉందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ Dr. త్రిక్రమ వర్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత SPF ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవటం ఇది మొదటి సారి అని తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించరాని, SPF సిబ్బంది అందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. SPF ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తేది: 14.10.2025 నుంచి నిర్వహించినటువంటి క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి స్పెషల్ హోమ్ సెక్రటరీ విజయ కుమార్ , ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రియాక్టర్ ఇన్- చార్జ్ వైస్ ఛాన్సిలర్ R. శివరాం ప్రసాద్ , కమాండెంట్ D.N.A. భాషా , అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులు స్పాన్సర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *