రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం ఆర్‌డీటీ స్టేడియంలో నవంబర్ 7 నుండి 9 వరకు జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2025 లో తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది విశిష్ట ప్రతిభ కనబరిచారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్, రాజానగరం సీఎస్.డీ.టి – జి. బాపిరాజు జట్టు రన్నర్‌అప్‌గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూర్పుగోదావరి జట్టు రన్నర్‌అప్ స్థానాన్ని సాధించగా, స్పీడ్ వాకింగ్ విభాగంలో జి. బాపిరాజు (రాజానగరం సీ ఎస్ డీ టి) ద్వితీయ స్థానం పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వారు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన రెవెన్యూ సిబ్బందిని అభినందించారు.
కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడా కార్యకలాపాలలో పాల్గొనడం ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడమే కాక, ఐక్యతా భావనను పెంచుతుందన్నారు. విధి నిర్వహణలోనూ ఇదే స్పూర్తితో పనిచేయాలని” సూచించారు.
జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ “తూర్పుగోదావరి రెవెన్యూ సిబ్బంది రాష్ట్ర స్థాయిలో రన్నర్‌అప్ బహుమతులు సాధించడం జిల్లా గర్వకారణం అన్నారు. క్రీడల పట్ల ప్రతి ఉద్యోగిలో ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు.
తూర్పుగోదావరి రెవెన్యూ సిబ్బందికి రాష్ట్రస్థాయి మీట్‌లో సాధించిన విజయంపై జిల్లా రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News