చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
చాగల్లు మండల అధ్యక్షుడు గా మట్టా రామస్వామి, ఉపాధ్యక్షుడు గా రామచంద్రరావు లను మంత్రి తానేటి వనిత అభినందించారు. చాగల్లు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయ్యడంలో నిబద్ధతతో పని చేయాలన్నారు. తొలుత చాగల్లు మండలాధ్యక్షుడుగా మార్కొండాపాడు ఎంపిటిసి మట్టా రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మట్టా వీరస్వామిని బ్రహ్మణగూడెం-2 ఎంపిటిసి ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, బొల్లా ధనలక్ష్మి బలపరిచారు. మండల ఉపాధ్యక్షుడు గా జుజ్జవరపు రామచంద్ర రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను ఎంపిటిసి టి. వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, సిహెచ్. శ్రీవిజయ బలపరిచారు. ప్రత్యేకాధికారి వ్యవసాయ శాఖ ఏఓ కె. ఏసుబాబు వారిచే మంత్రి సమక్షంలో అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో చాగల్లు ఎంపిడిఓ బి.రామ్ ప్రసాద్, జడ్పీటీసి విజయ దుర్గ, చాగల్లు సర్పంచ్ యూ. మనస్శాంతి, ఇతర నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News