మహిళల శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

-ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన సదస్సులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు విశేష స్పందన లభిస్తుంది. సోమవారం , హెచ్.బీ కాలనీలోని విఎంసీ కళ్యాణ మండపంలో 42 వ డివిజన్ సమాఖ్య మహిళలకు నిర్వహించిన వర్క్ షాప్ లో స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎన్ వీ సత్యనారాయణ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ కుమార్,ఒమేగా అను మై బేబీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక, పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ నవ్య , సి ఎల్ టి ఎస్ సమత, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు,42 వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలకు ఆరోగ్యపరమైన, నైపుణ్యాభివృద్ధి పరమైన అంశాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను గురించి తెలియజేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆర్థికపరమైన, ఆరోగ్య నైపుణ్య అభివృద్ధి , సొంత ఇంటి స్థలాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.

ఎన్డీఏ కార్యాలయ సిబ్బంది రియాజ్ సుల్తానా , మోహనలక్ష్మి,కావలి లక్ష్మీ, వాసంతి, సీ ఓ రాణి, ఆర్పీలు ,సుజనా మిత్ర కోఆర్డినేటర్ యలమంచిలి ఫణీంద్ర, కార్యక్రమాన్ని పర్యవేక్షించారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *