Breaking News

డా.పసుపులేటి హరిప్రసాద్ నివాసానికి విచ్చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి అర్బన్ పరిధిలోని జీవకోన ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్‌లు అందజేశారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్, పసుపులేటి హరిప్రసాద్ నివాసానికి విచ్చేయగా, హరిప్రసాద్ సోదరులు వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్ కుటుంబసమేతంగా మంత్రి ని ఘనంగా ఆహ్వానించి, ఆత్మీయ తేనేటి విందుతో సత్కరించారు. తదుపరి మంత్రి జనసేన నాయకులు మరియు కార్యకర్తలను ప్రత్యేకంగా కలిసి, వారందరితో సాదరంగా సంభాషించారు. స్థానిక సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు, భవిష్యత్ అభివృద్ధి చర్యలపై విస్తృతంగా చర్చిస్తూ, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను శ్రద్ధగా వినిపించారు. జనసేన శ్రేణుల నుండి వచ్చిన సూచనలకు మంత్రి సానుకూలంగా స్పందించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *