కంచికచర్లలో పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ శంకుస్థాపన మహోత్సవం

-శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించిన పీహెచ్సీ డాక్టర్ మధురిమ

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 62 లక్షల రూపాయల వ్యయంతో పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సేవలను ఈ యూనిట్ ద్వారా మరింత బలోపేతం చేయనున్నట్టు తెలియజేశారు. కంచికచర్ల పట్టణంలో ప్రజా ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరిచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ భవనం అనేది 15 వ ఫైనాన్స్ నిధుల ద్వారా 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వసతులతో కూడిన ఈ హెల్త్ యూనిట్ నిర్మాణం పూర్తి అయితే గ్రామాలు, మండల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన వైద్య సేవల కోసం ఇలాంటి కేంద్రాల నిర్మాణం అత్యవసరం అని ఆమె స్పష్టం చేశారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క డాక్టర్ మధురిమ మాట్లాడుతూ తను డాక్టర్ గా పనిచేస్తున్న కాలంలో పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు. ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలను అందించడానికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న హాస్పిటల్ స్టాఫ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ కమిటీల ఉపాధ్యక్షులు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పీహెచ్సీ స్టాఫ్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *