– జిల్లా సహకార అధికారి ఎమ్. వెంకట రమణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో యూరియా పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ PACSల సీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందనీ జిల్లా సహకార అధికారి ఎమ్ వెంకట రమణ శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లాలోని 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలకు ఈ మేరకు అవగాహనా కల్పించడం జరిగిందని తెలిపారు . జిల్లాలో యూరియా సరఫరా విషయమై క్రింది సూచనలు కచ్చితంగా అమలు చేయాలి యూరియా పంపిణీ సందర్భంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన విధి విధానాలు పై ఆదేశాలు … యూరియా సరఫరా సమయంలో రైతులు నిలబడే క్యూ లైన్ల వద్ద నీడ, తాగునీరు, కుర్చీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. రైతులు లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే, వ్యవసాయ సహాయకులు (VAA) మరియు మండల వ్యవసాయ అధికారులు (MAO) ఇచ్చిన స్లిప్ ఆధారంగా రైతు సేవ కేంద్రం వారీగా దశలవారీగా పంపిణీ చేయాలి. పంట నమోదు (Crop Booking) వివరాల ప్రకారం ప్రతి PACSలో రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాలి. అవసరమైతే రైతు సేవ కేంద్రం వద్దనే నేరుగా యూరియా పంపిణీ చేయాలి. యూరియా సరఫరా జరిగే సమయంలో MAO మరియు VAA సంఘంలో తప్పనిసరిగా హాజరు కావాలి, వారి సమక్షంలోనే పంపిణీ జరగాలి. రైతులు అవసరానికి మించి ఒకేసారి పెద్ద మొత్తంలో యూరియా కొనుగోలు చేయవద్దని సలహా ఇచ్చారు. జిల్లాలో యూరియా కొరత లేదు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో యూరియా కొరత ఏమాత్రం లేదని, వరి నాటు ప్రక్రియ కూడా ఇంకా పూర్తిగా వేగం అందుకోలేదని, కాబట్టి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా సహకార అధికారి స్పష్టం చేశారు. PACSల్లో ఆర్థిక క్రమశిక్షణ — కఠిన అమలు సదస్సులో PACSలలో రుణాల పంపిణీపై కూడా కఠిన నిబంధనలు విధించబడ్డాయి: అన్ని రుణాలు కేవలం Account Payee Cheques ద్వారానే జారీ చేయాలి. పంట రుణాల కోసం Pay Orders, LT రుణాల కోసం Bearer Cheques జారీని తక్షణమే నిలిపివేయాలి. నగదు రూపంలో రుణాల పంపిణీ పూర్తిగా నిషేధం. లబ్ధిదారుల నుంచి ఖాళీ వోచర్లు, Promissory Notes, ఖాళీ సంతకం పత్రాలు సేకరించడం పూర్తిగా నిషేధం. అన్ని PACSలు e-PACS సాఫ్ట్వేర్ ద్వారా పూర్ణ స్థాయి కంప్యూటరీకరించిన అకౌంటింగ్ నిర్వహించాలి. రోజువారీగా తప్పనిసరిగా Day-End Closing చేయాలి. ఈ ఆదేశాల అమల్లో ఏవైనా వ్యత్యాసాలు (Deviations) ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News