విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తిదాయకం అని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) ఏ రవీంద్రరావు అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా రామస్వామి చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ 1887 జనవరి 15న కృష్ణా జిల్లాలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నారని, న్యాయవిద్య అభ్యసించి న్యాయవాదిగా పనిచేసి, సమాజంలో న్యాయం, సమానత్వం ఉండాలన్న ఆలోచనలతో సాహిత్యాన్ని ఆశ్రయించారని అన్నారు. రచనలతో ప్రజల్లో ఆలోచనా చైతన్యం కలిగించడమే ఆయన లక్ష్యం పెట్టుకున్నారని, కులవ్యవస్థలోని అన్యాయాలను అరికట్టారాని అన్నారు. ఈ కార్యక్రమం లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ రజియ షబీన, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News