Breaking News

ఏసీఏ ఆధ్వ‌ర్యంలో 88 నియోజ‌క‌వ‌ర్గాల్లో రూర‌ల్ టాలెంట్ సెర్చ్ ప్రొగ్రామ్

-ఏఫ్రిల్ 5వ తేదీ మంత్రి నారా లోకేష్ చేతుల మీద‌గా రూర‌ల్ టాలెంట్ సెర్చ్ ప్రొగ్రామ్ ప్రారంభం: ఏసీఏ ప్రెసిడెంట్, ఎంపీ కేశినేని శివ‌నాథ్
-డాన్ బోస్కో కోహ్లి స్పోర్ట్స్ అకాడ‌మీ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
రూర‌ల్ ప్రాంతంలో క్రీడాకారుల‌ను వెలుగులోకి తీసుకురావాల‌న్న సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఏసీఏ ఆధ్వ‌ర్యంలో రూర‌ల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్న‌ట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

నందిగామ ప‌ట్టణంలో . ఆర్.సి.ఎమ్ చ‌ర్చి స‌హ‌కారంతో నూత‌నంగా ఏర్పాటు చేసిన డాన్ బాస్కో క్లోహి అకాడ‌మి ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంబించారు. విజ‌య‌వాడ లోని లేని విధంగా నందిగామ లో బాక్స్ క్రికెట్, క్రికెట్ సాధ‌న చేసేందుకు నెట్ లు ఏర్పాటు చేసినందుకు నిర్వ‌హ‌కుల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినందించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ గ‌త పేద‌ళ్ల‌లో వైజాగ్ స్టేడియానికి అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచులు ఐదు వ‌స్తే..తాము బాధ్య‌తలు స్వీక‌రించిన ఏడాదిన్న‌ర ప‌ది మ్యాచులు తీసుకురావ‌టం జ‌రిగింద‌న్నారు. రాష్ట్రంలోని రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని క్రికెట్ క్రీడాకారుల‌కు అవ‌కాశాలు క‌ల్పించేందుకు రూర‌ల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ద్వారా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజు టెంప‌ర‌రీ క్యాంప్ నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకు కావాల్సిన నెట్స్ రెండు వ్యాన్ల నిండా సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో 88 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫాస్ట్ బౌల‌ర్స్ , బ్యాట్ మెన్స్, స్పిన్ బౌల‌ర్స్ ను సెలెక్ట్ చేయనున్న‌ట్లు తెలిపారు.

అలాగే ఏసీఏ ఆధ్వ‌ర్యంలో మూల‌పాడు క్రికెట్ స్టేడియంలో ఒక అకాడ‌మీ స్టార్ట్ చేయ‌బోతున్నట్లు ప్ర‌క‌టించారు. ఇక్క‌డ స‌మ్మ‌ర్ క్యాంప్ తో …టాలెంట్ వున్న వాళ్ల‌కి కోచింగ్ ఇవ్వ‌టం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. ఈ సారి ఏపీఎల్ మ్యాచ్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్రౌండ్స్ లో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరి, క‌డ‌ప‌, అనంత‌పురంలో విశాఖ‌, కాకినాడ స్టేడియాల‌ను సిద్దం చేయిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బిసిసిఐ పెట్టిన విధంగా మూల‌పాడు క్రికెట్ స్టేడియంలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ను పెట్టి క్రికెట్ అభివృద్దికి దోహ‌ద‌ప‌డ‌తామ‌న్నారు.
సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల ప్ర‌కారం శాప్ ఆధ్వ‌ర్యంలో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న చిన్న క్రికెట్ మైద‌నాలు ఏర్పాటు చేయ‌టానికి స‌న్న‌హాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. విజ‌య‌వాడ ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియం ఆధునీక‌ర‌ణ ప‌నుల కోసం టెండ‌ర్లు పిల‌వ‌టం జ‌రిగింద‌న్నారు. త్వ‌ర‌లో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో విజ‌య‌వాడ ప్రీమియ‌ర్ లీగ్ పోటీలు నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు తెలిపారు.ఈ విజ‌య‌వాడ ప్రీమియ‌ర్ లీగ్ లో రాణించిన క్రికెట్ క్రీడాకారుల‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ లో త‌గిన విధంగా ప్రోత్స‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దంచేస్తున్న‌ట్లు తెలిపారు.

త్వ‌ర‌లో నందిగామ‌కి మంచినీటి వ‌స‌తి

నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌తో క‌లిసి కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. నందిగామ ప‌ట్ట‌ణానికి మంచి నీటి వ‌స‌తి అందించేందుకు డిపిఆర్ త‌యారు కావ‌టంతో పాటు టెండ‌ర్ల‌కు వెళ్ల‌టం జ‌రిగింద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానికి స‌మీపంలో వున్న నందిగామ నియోజ‌క‌వ‌ర్గం రాబోయే రోజుల్లో మ‌రింతగా అభివృద్ది చెందుతుంద‌న్నారు.

ఎమ్మెల్యే తంగిరా సౌమ్య మాట్లాడుతూ ప‌ట్ట‌ణంలో డాన్ బోస్కో కోహ్లి స్పోర్ట్స్ అకాడ‌మీ ఏర్పాటు చేసిన నిర్వ‌హ‌కుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఏసీఏ ప్రెసిడెంట్ , ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఎన్టీఆర్ జిల్లాలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల గ్రౌండ్స్ ను అభివృద్ది చేసి , క్రీడ‌ప‌రికరాలు అంద‌జేశారు. విద్యార్ధులు,యువ‌త క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి పెంచుకుని రాణించాలి…చ‌దువుకి ఎంత మంచి భ‌విష్య‌త్తు క్రీడ‌ల్లో అంతే భ‌విష్య‌త్తు వుంటుంద‌ని…రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడ‌కారుల‌కు అండ‌గా వుంటుంద‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో నందిగామ మున్సిప‌ల్ చైర్మ‌న్ కృష్ణ కుమారి, కంచిక‌చ‌ర్ల మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ కోగంటి బాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ యేచూరి రాము, చంద‌ర్ల పాడు మండ‌ల‌పార్టీ ప్రెసిడెంట్ మేక‌ల సుధాక‌ర్, క‌మ్మ‌కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ స‌జ్జా అజ‌య్, దాస‌రి కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ ఎమ్.శ్రీరామ్, దేవినేని వెంక‌ట ర‌మ‌ణ కంచ‌ల ఎత్తిపోత‌ల డిసి చైర్మ‌న్ రాట‌కొండ చంద్ర‌శేఖ‌ర్, గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్ చైర్మ‌న్ నాగేశ్వ‌ర‌రావు, సీనియ‌ర్ నాయ‌కులు వాసిరెడ్డి ప్ర‌సాద్, ఉన్నాం న‌రసింహారావు, కాస‌ర్ల లక్ష్మీనారాయ‌ణ‌, క‌త్తిరాజు శ్రీనివాస‌చారి, బర్రె శంక‌ర్రావు, డాన్ బోస్కో కోహ్లి స్పోర్ట్స్ అకాడ‌మీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ దుర్గా ప్ర‌సాద్ ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు , క్రీడాకారులు, యువ‌కులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *