-171,172 వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జె.నివాస్…
-కోవిడ్ కేసులు తగ్గుతున్నాయన్న భావనతో వుండకుండా ఫీవర్‌సర్వే నిర్వహించండి…
-సోమవారం మోగా వ్యాక్సినేషన్‌పై ప్రజలను చైతన్యపరచండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనాను జయించేందుకు ఫీవర్‌సర్వే, వ్యాక్సినేషన్‌పై పూర్తి శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. నగరంలోని ప్రైజర్‌పేట వింఛిపేట ప్రాంతంలో మోటూరి హనుమంతరావు పాఠశాల సమీపంలోని 171,172 వార్డు సచివాలయాలను శనివారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేసులు తగ్గుతున్నాయన్న భావనతో వుండకుండా రోజువారి ఫీవర్ సర్వే నిర్వహించడంతోపాటు అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రజలను చైతన్య పరచాలన్నారు. సోమవారం నిర్వహించే మోగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వ్యాక్సిన్ పొందేందుకు ప్రజలను చైతన్య పరచాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 42,29,971 మంది వ్యాక్సినేషన్ పొందారని, వారిలో 27,36,808 మంది మొదటి డోసు, 14,93,170 మంది రెండవ డోసు టీకాలు తీసుకున్నారన్నారు. ఇంకా కొంత మంది వ్యాక్సిన్ పొందేందుకు నిరాకరిస్తున్నరన్నా విషయంపై కలెక్టర్ స్పందిస్తూ అందుకు వారు తెలుపుతున్న కారణాలను కూడా నమోదు చేయాలని సూచించారు.ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి ఆ ప్రాంతంలో ఎంతమంది కరోనాతో మరణించింది, ఇతర వ్యాధులతో బాదపడుతున్నా వారి వివరాలను నమోదు చేయాలన్నారు. 171వ వార్డు సచివాలయంలో ఫీవర్ సర్వేకు రూపొందించిన ఫార్మట్ బాగుందని ఇదే నగరంలోని అన్ని సచివాలయాల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సియంఓహెచ్ డా. జి. గీతాబాయిని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో వార్డు సచివాలయ అడ్మిన్ నాగరాజు పనితీరుపట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్‌పై నూరుశాతం దృష్టి సారించాలన్నారు. సచివాలయంలో డాష్‌బోర్డు, సిబ్బంది హాజరు పట్టి, సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు.ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ఇప్పటికే బాగా పనిచేస్తున్నారని ఇదే స్పూర్తితో పనిచేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఏ ఒక్క అంశం పెండిరగ్లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏ మేర ప్రజలకు అందింది సచివాయంలోని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ క్యాలండర్, ఇతర అంశాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించిన విధానాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి రోజు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరుగైన సేవలందించాలన్నారు. ప్రజలకు సేవలందించడంలో ఏ ఒక్కరూ కూడా జాప్యం, నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
వీరి వెంట సియంఓహెచ్ డా. జి గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News