విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పటమటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమాన్ని ఈ నెల 18వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. విజయవాడ పటమట శ్రీ దత్తనగర్ లోని అవధూత దత్తా పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి సందర్శించి మరకత రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శనివారం ముఖ్యమంత్రి భద్రత అధికారులు, ఇతర పోలీసు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. వీరి వెంట సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్,ఏసీపీ హర్షవర్ధన్ రాజు,ఆశ్రమ పర్యవేక్షకులు అవధూత రమేష్,ఎగ్జిక్యూటివ్ ఏ. ఎస్.ఆర్.కె.ప్రసాద్,ట్రస్టు మెంబర్ జి. వి.ప్రసాద్,వియంసి సియం వో హెచ్ డా.జి.గీతబాయ్, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …