46, 47 వార్డు సచివాలయాలను విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పటమటలోని 46, 47 వార్డు సచివాలయాలను విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేసారు. శనివారం వార్డు సచివాలయాలను సందర్శించిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల గురించి అవగాహన పరిచేందుకు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలిపే బోర్డులను ఆయన పరిశీలించారు. వివిధ పథకాల్లో ప్రయయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. వీరి వెంట తహసీల్దార్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *