Breaking News

మార్చి 16 నుండి 18 వరకు, 23 నుండి 25 తేదీ వరకు జిల్లాలో రైతన్నా మీకోసం కార్యక్రమం

-రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల పై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో జిల్లాలో మార్చి 16 నుండి 18 వరకు అలాగే 23 నుండి 25 తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న రైతన్నా మీకోసం కార్యక్రమం ఏర్పాట్ల పై వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ జేడి ఎస్.ప్రసాద్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతన్నా మీకోసంలో భాగంగా వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి తెలియజేస్తూ కరపత్రాలను పంచాలన్నారు. ప్రతి రైతు మొబైల్ నందు ఏపీ ఎయిమ్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పండించే పంటకు వచ్చే చీడపీడల గురించి, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ రెట్లు, ఈ – పంట నమోదు, తదితర సమాచారం తెలుసుకునే విధంగా ఈ యాప్ ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు. కావున రైతులందరూ దీనిని ఉపయోగించుకునేలా సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సంవత్సరం ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున, పంట మార్పిడి విధానాలు అవలంబించాలని, అలాగే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పి ఎం డి ఎస్ కిట్లు విరివిగా ఉపయోగించాలని రైతుల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ప్రతి అధికార బృందం గ్రామంలో రోజుకు విధిగా 90 ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమ పురోగతిని ప్రతి రోజు నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *