Breaking News

వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన వైసీపీ నేత దేవినేని అవినాష్

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, స్థానిక ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు,జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ, వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

దేవినేని అవినాష్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అత్యంత నష్టపోయింది రైతాంగమే. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. ఒకప్పుడు రైతాంగాన్ని “సుద్ద దండగ” అన్న మాటలను ఇప్పుడు కార్యరూపంలో చూపిస్తున్నారు. రైతులు మార్కెట్ యార్డుల్లో ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు చూడకుండా విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారని విమర్శించారు. సింగపూర్, మలేషియా పర్యటనలు కాదు. రైతుల దగ్గరకు రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమస్యలను పక్కనపెట్టి అవార్డుల కోసం తిరుహూతున్నారు. మంత్రి లోకేష్ జాడ తెలియడం లేదని, మిగతా మంత్రులు మాట్లాడే ధైర్యం లేక నిశ్శబ్దంగా ఉన్నారు. జిల్లా స్థాయి అధికారుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, “మేమేం చేయలేము” అని చేతులు ఎత్తేస్తున్నారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సంక్షోభం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. పెరిగిన ఖర్చులతో రైతులు మరింత కష్టాల్లో కూరుకుపోతున్నారు. మొక్కజొన్నకు సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణలో క్వింటాల్‌కు ₹2400 వరకు కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ ₹1500 కూడా దక్కడం లేదు. కనీస మద్దతు ధర (MSP) అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. వెంటనే మొక్కజొన్న, ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించాలి. మార్కెట్ యార్డుల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. రైతులకు డీజిల్ సబ్సిడీ అందించాలి. అధికారులను బాధ్యతాయుతంగా పని చేయించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని దేవినేని అవినాష్ భరోసా ఇస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల, గ్రామ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *